- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు నెలల పసిపాపను అపహరించడానికి ప్రయత్నించిన గుర్తుతెలియని వ్యక్తి
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని నందమూరి నగర్‌లో బుధవారం సాయంత్రం కలకలం చోటుచేసుకుంది.

దిశ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని నందమూరి నగర్‌లో బుధవారం సాయంత్రం కలకలం చోటుచేసుకుంది. రాజేందర్–భవాని దంపతులకు చెందిన మూడు నెలల పసిపాపను గుర్తుతెలియని వ్యక్తి బుధవారం సాయంత్రం అపహరించడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన తల్లి భవాని వెంటనే అడ్డుకుని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం అతడిని ఏ ఊరు, ఏ రాష్ట్రానికి చెందినవాడివి, ఎక్కడి నుంచి వచ్చావని ప్రశ్నించగా, కొద్దిసేపు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవాడినని, మరికొద్దిసేపు మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందినవాడినని పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు సంఘటన స్థలానికి చేరుకుని గుర్తుతెలియని వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






