- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్‌తో పాడి ఆవు మృతి
by Ratna Kumari |
గుడిపల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి విద్యుత్ తీగ తెగిపడి పాడి ఆవు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, పెద్ద అడిశర్లపల్లి (గుడిపల్లి) : గుడిపల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి విద్యుత్ తీగ తెగిపడి పాడి ఆవు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సామనూరి నరసరాజు తన పాడి పశువులను మేపుకుని ఇంటికి తీసుకొస్తుండగా, ఈదురుగాలుల కారణంగా తెగిపడి నేలపై పడిన విద్యుత్ తీగపై ఒక పాడి ఆవు కాలుపెట్టడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. సుమారు రూ.80 వేల విలువైన పాడి ఆవును కోల్పోయానని వాపోయాడు. తనకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం, సంబంధిత అధికారులు గుర్తించి తగిన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. గ్రామస్థులు కూడా విద్యుత్ శాఖ అధికారులు తెగిపడిన విద్యుత్ తీగలను వెంటనే తొలగించి, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story






