- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పద్మ, మండల వ్యవసాయ అధికారి బట్టు అశోక్ సూచించారు.

దిశ, కారేపల్లి : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పద్మ, మండల వ్యవసాయ అధికారి బట్టు అశోక్ సూచించారు. బుధవారం అప్పాయిగూడెం రైతు వేదికలో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో కలిసి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు పంట నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో తాగునీటి సరఫరా, వ్యవసాయం, విద్యుత్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మార్వో ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీవో మల్లెల రవీంద్ర ప్రసాద్, ఏఎస్‌వో సైదులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్, విద్యుత్ శాఖ ఏఈలు వెంకటేశ్వర్లు, శ్రీశైలం, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






