- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైన్ స్నాచర్ అరెస్ట్... మంగళసూత్రం, బైక్ స్వాధీనం
ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు వంతెన సమీపంలో చేపలు విక్రయిస్తున్న వృద్ధ మహిళ వద్ద చేపలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి మెడలోని సుమారు రూ. లక్ష విలువైన బంగారు నానుత్రాడును లాక్కొని పరారైన నిందితుడిని ఏలూరు రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు..

X
దిశ, ఏలూరు సిటీ: ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు వంతెన సమీపంలో చేపలు విక్రయిస్తున్న వృద్ధ మహిళ వద్ద చేపలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి మెడలోని సుమారు రూ. లక్ష విలువైన బంగారు నానుత్రాడును లాక్కొని పరారైన నిందితుడిని ఏలూరు రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ నేతృత్వంలో ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గాలింపుచేపట్టింది. ఈ గాలింపులో మండవల్లి మండలం భైరవపట్నానికి చెందిన గొల్లు నాగ కార్తీక్ (25)ను అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు నానుత్రాడును, హీరో ఫ్యాషన్ ప్రో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని ఏలూరు రూరల్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Next Story






