జింబాబ్వేను లైట్ తీసుకోవ‌ద్దు...ప్లేయ‌ర్ల‌కు అయ్య‌ర్ వార్నింగ్

by velandi.Saikiran |

జింబాబ్వేను లైట్ తీసుకోవ‌ద్దంటూ ప్లేయ‌ర్ల‌కు అయ్య‌ర్ వార్నింగ్ ఇచ్చారు.

జింబాబ్వేను లైట్ తీసుకోవ‌ద్దు...ప్లేయ‌ర్ల‌కు అయ్య‌ర్ వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: రేపటి నుంచి జింబాబ్వేతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిపోయామని ఎవరు బాధపడకూడదని.. ధైర్యంగా ముందుకు వెళ్లాలని కుర్ర క్రికెటర్లకు సూచనలు చేశారు. అలాగే జింబాబ్వేతో ఆడుతున్నామని ఎవరు కూడా లైట్ తీసుకోకూడదని హెచ్చరించారు.

పెద్ద జట్లతో ఆడినట్లుగానే... జింబాబ్వేను పరిగణలోకి తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు శ్రేయస్ అయ్యర్. వాస్తవానికి జింబాబ్వేకు చాలా ఆలస్యంగా తమ జట్టు చేరిందని.. దీనివల్ల సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయామని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇలాంటి సమస్యలు తరచూ ఎదురవుతాయని.. కానీ వాటిని అధిగమిస్తామని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ తో ఆడినప్పుడు భారత జట్టు వీక్నెస్ లు బయటపడ్డాయని.. వాటిని అధిగమిస్తామని వివరించారు. సిరీస్ గెలిచి, త‌మ సత్తా చాటుతామ‌ని వెల్ల‌డించారు.

Next Story