- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది
విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ‘ఛాత్రోంకి గూంజ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్మించే యువతకు నాణ్యమైన విద్య, పారదర్శకమైన పరీక్షా విధానం, సమాన అవకాశాలను కల్పించడం కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, అయూబ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, విద్యార్థులు, యువజన ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






