- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యనే తలరాతలను మారుస్తుంది
విద్య ఒక్కటే భవిష్యత్తును, తలరాతలను మారుస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు.

దిశ, చిన్నచింతకుంట: విద్య ఒక్కటే భవిష్యత్తును, తలరాతలను మారుస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వడ్డేమాన్ ప్రభుత్వ పాఠశాలకు నెల్లికొండి గ్రామం నుంచి కాలినడకన వచ్చే విద్యార్థులకు ఎమ్మెల్యే జీఎంఆర్ సైకిళ్లు, టైలు, బెల్టులు, షూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. వివిధ గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి సైకిళ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని తమ తల్లిదండ్రులతో పాటు తమ గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్, సర్పంచులు ఈశ్వర్ సింగ్, స్వప్న శివకుమార్, కురుమన్న, దామోదర్ యాదవ్, రంజిత్, బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.






