పంచదార్ల అక్రమ మైనింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్.. విచారణకు ఆదేశం

by Ramesh Naini |

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండ రెవెన్యూ భూముల్లో జరిగిన అక్రమ గ్రావెల్, మట్టి తవ్వకాలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.

పంచదార్ల అక్రమ మైనింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్.. విచారణకు ఆదేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని పంచదార్ల కొండ రెవెన్యూ భూముల్లో జరిగిన అక్రమ గ్రావెల్, మట్టి తవ్వకాలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ పర్యావరణ ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు.

అనుమతుల తక్షణ రద్దు..

నిబంధనలను ఉల్లంఘించి తవ్వకాలకు పాల్పడిన సదరు మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్‌మెంట్, ఆపరేషన్స్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు.

నో మైనింగ్ జోన్‌గా ప్రకటన

పంచదార్ల కొండ, దాని పరిసర ప్రాంతాల పర్యావరణాన్ని కాపాడేందుకు ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు స్పష్టం చేశారు. అలాగే, ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థపై కఠిన చర్యలతో పాటు పర్యావరణ జరిమానా విధించాలని, దెబ్బతిన్న పర్యావరణాన్ని పునరుద్ధరించే బాధ్యతను కూడా సదరు సంస్థపైనే వేయాలని సూచించారు.

ఎన్ఐహెచ్ (NIH) శాస్త్రవేత్తలతో పరిశీలన

కొండ దిగువన ఉన్న సహజ జలధారల్లో రంగు మార్పుపై జాతీయ జలవిజ్ఞాన సంస్థ (NIH) శాస్త్రవేత్తలతో అధ్యయనం చేయించి, వారి శాస్త్రీయ నివేదికల ఆధారంగా జలధారల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంచదార్లలో ఉన్న పురాతన శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ సంరక్షణకు దేవాదాయ, పురావస్తు శాఖలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

Next Story