కేంద్ర ప్రభుత్వంలో కీలక నియామకం.. ‘నీతి ఆయోగ్’ కొత్త బాస్‌గా అనురాగ్ జైన్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-22 16:12:49  IST  )

కేంద్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో కీలక నియామకం జరిగింది.

కేంద్ర ప్రభుత్వంలో కీలక నియామకం.. ‘నీతి ఆయోగ్’ కొత్త బాస్‌గా అనురాగ్ జైన్
X

దిశ, వెబ్‌డెస్క్: పరిపాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అత్యున్నత విధాన రూపకల్పన సంస్థ ‘నీతి ఆయోగ్’ (NITI Aayog) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా సీనియర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ (Anurag Jain) నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ (ACC) అధికారికంగా ఆమోదం తెలిపింది. 1989 ఐఏఎస్ బ్యాచ్‌ మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన అనురాగ్ జైన్ రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) కార్యదర్శి మనీషా సక్సేనా అధికారిక ఉత్వర్వులు జారీ చేశారు. పాలనా వ్యవహారాల్లో చాలా అనుభవం ఉన్న అనురాగ్ జైన్ నియామకంతో ‘నీతి ఆయోగ్’ పాలన వ్యవహరాలు జెట్ స్పీడ్‌లో దూసుకెళ్లనున్నాయి.

Next Story