- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold: బంగారం మళ్లీ పరుగులు.. ఒక్కరోజులో రూ. 2,300 జంప్
ఎంసీఎక్స్‌లో ఆగస్టు డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,580 రూ.1,44,463కు చేరింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. కొంతకాలంగా స్థిరంగా ఉన్న ధరలు బుధవారం మరోసారి పెరిగాయి. స్పాట్ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో పాటు స్పెక్యులేటర్లు కొత్త కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగడం, ద్రవ్యోల్బణ భయాలతో బంగారంతో పాటు వెండికి గిరాకీ ఏర్పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్టు డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ.1,580 రూ.1,44,463కు చేరింది. మార్కెట్‌లో అనూహ్యంగా కొనుగోళ్ల ఊపు పెరగడం వల్లే ధరలు వేగంగా పెరిగాయని విశ్లేషకులు తెలిపారు. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి రూ. 2,290 పెరిగి రూ. 1,46,510కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 2,100 పెరిగి రూ. 1,34,300గా ఉంది. వెండి కూడా రూ. 5,000 పెరగడంతో కిలో రూ. 2.45 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధర 1.23 శాతం పెరిగి ఔన్స్‌కు 4,127.3 అమెరికన్ డాలర్లకు చేరింది.






