70 ఏళ్ళకి ఖడక్ ఖడక్ కొత్త సోకులా.. ‘పళ్లబురుసు’ నుంచి లేటెస్ట్ పోస్టర్

by Chukka Sudharani |

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వినూత్న ప్రాజెక్టు ‘పళ్ళ బురుసు’.

70 ఏళ్ళకి ఖడక్ ఖడక్ కొత్త సోకులా.. ‘పళ్లబురుసు’ నుంచి లేటెస్ట్ పోస్టర్
X

దిశ, సినిమా: అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వినూత్న ప్రాజెక్టు ‘పళ్ళ బురుసు’. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోదభరితమైన కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఉదయ్ చౌహాన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్నారు. వినూత్న కాన్సెప్ట్‌, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన 'పళ్ళబురుసు' 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘70 ఏళ్ళకి ఖడక్ ఖడక్ కొత్త సోకులా?.. పళ్ళబురుసు నుండి ఫుట్ ట్యాపింగ్ జానపద పాట కోసం సిద్ధంగా ఉండండి.. కొత్త సోకు లిరికల్ వీడియో 24 జులై 11:07AMకి రాబోతున్నది’ అంటూ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Next Story