బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సెన్సేషన్.. ‘ధురంధర్’ నటి ఆయేషా ఖాన్ అరెస్ట్

by Kema Shiva Kumar |

బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సెన్సేషన్ చోటుచేసుకుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సెన్సేషన్.. ‘ధురంధర్’ నటి ఆయేషా ఖాన్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి, ‘బిగ్‌ బాస్’ ఫేమ్ ఆయేషా ఖాన్‌ (Ayesha Khan)ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు ఆమెను వ్యాన్‌లోకి తోసి తీసుకెళ్లారని, తాను కనీసం నిరసన గురించి మాట్లాడకపోయినా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని నటి ఆవేదన వ్యక్తం చేసింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్..

అయితే, బాంద్రా ప్రాంతంలో ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జ్‌‌ చేసిన నేపథ్యంలో నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ఆయేషా ఖాన్ చేరుకున్న కొద్దిసేపటికే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె పోలీసులతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు వినకుండా వ్యాన్‌లోకి నెట్టి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నాటకీయ పరిణామాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఆయేషా ఖాన్ స్పందిస్తూ.. తాను నిరసన ప్రాంతానికి చేరుకున్నానని, కానీ ప్రదర్శన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే నన్ను బలవంతంగా వ్యాన్‌లోకి నెట్టేశారని వెల్లడించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పోలీసులు ఇలా ప్రవర్తించడం పట్ల ఆయేషా ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Next Story