- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెప్పినట్లు వినలేదు అని నా నుంచి సినిమాలు లాగేసుకున్నారు.. ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ప్రియాంకా చోప్రా తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.

దిశ, సినిమా: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ప్రియాంకా చోప్రా.. త్వరలో మహేశ్ బాబు, రాజమౌళి కలయికలో వస్తోన్న ‘వారణాసి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటున్న ఈ అమ్మడు.. తాజాగా చేసిన కామెంట్స్‌తో వార్తల్లో నిలిచింది. ‘కొందరిని మెప్పించనందుకు, వారు చెప్పినట్లుగా నేను చేయనందుకు నా సినిమా అవకాశాలు నా నుంచి లాగేసుకున్నారు. ఇతరులు రాజీ పడినట్లుగా, నేను దానికి ఇష్టపడలేదు. కొందరు స్టార్ హీరోలు నన్ను ఉద్దేశపూర్వకంగా సినిమాల నుంచి తప్పించారు. 2007లో ‘సలామ్ ఎ ఇష్క్’ షూటింగ్ సమయంలో నాకు వేరే సినిమా అవకాశం వచ్చింది. ఆ చిత్ర హీరో ఒకసారి నా దగ్గరకు వచ్చారు. అయితే.. సినిమా స్టార్ట్ అవ్వడానికి నెల రోజుల టైమే ఉండటంతో చర్చించడం కోసం వచ్చారేమో అనుకున్నా.. కానీ నేను ఊహించని విధంగా ‘దర్శకుడు ఈ సినిమాను పొరపాటున నీకు ఇచ్చారు.. నిజానికి ఈ పాత్ర వేరే హీరోయిన్‌ది.. మనం త్వరలో మరో సినిమా చేద్దాం’ అని చెప్పారు. దీంతో నేను షాక్ అయ్యాను. ఆ టైంలో నా కెరీర్ గురించి ఆలోచించి నటనపై పూర్తి దృష్టి పెట్టాను. అయితే.. ఇలాంటి నా సినీ కెరీర్‌లో ఒకసారి కాదు.. చాలా సార్లు జరిగింది. ఈ విషయాల గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రియాంక.






