- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విచ్చిన్నకర రాజకీయాలు చేస్తున్నారు: రాహుల్‌పై రాంచందర్ రావు ఫైర్
కాంగ్రెస్ పార్టీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అవలంబిస్తున్న దేశవ్యతిరేక, విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు...

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అవలంబిస్తున్న దేశవ్యతిరేక, విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు కీలక సమావేశాలు జరుగుతున్న సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాహుల్ గాంధీ, సభను బహిష్కరించి వీధి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. నీట్ పరీక్ష లీకేజీ అంశంపై సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినప్పటికీ, సమాధానం చెప్పలేక చర్చ నుంచి పారిపోయిన రాహుల్ గాంధీ, ప్రధాని నివాసం ముట్టడికి దిగడం ఆయన అపరిపక్వతకు, చట్టసభల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుంటే, తట్టుకోలేక రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌ల ప్రేరణతో విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో రైతు ఉద్యమం ముసుగులో, షాహిన్ బాగ్ ఆందోళనలో ఏ విధంగానైతే దేశవ్యతిరేక శక్తులు హైజాక్ చేశాయో, నేడు 'సీజేపీ' పేరుతో జరుగుతున్న ధర్నా కూడా అదే తరహాలో సాగుతోందని రాంచందర్ రావు గారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో నిరసనకు దిగిన వారిలో అసలు నీట్ విద్యార్థులే లేరని, కేవలం యాంటీ సోషల్, అల్ట్రా లెఫ్ట్ మూకలను జమ చేసి ఆందోళనలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. సదరు నిరసనల్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణతో పాటు చైనా, పాకిస్తాన్‌లకు మద్దతుగా దేశవ్యతిరేక నినాదాలు చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. ఇతర దేశాల నుంచి వస్తున్న కోట్లాది రూపాయల విదేశీ మాయలో పడి రాహుల్ గాంధీ విదేశీ ఏజెంట్‌లా మారి బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో యువతను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయితే భారతీయ యువత దేశభక్తి కలిగిన వారని, దేశం కోసం ప్రాణాలిస్తారు తప్ప ఇలాంటి కుట్రలకు లొంగరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న ఈ విధ్వంసకర, 'తుక్డే తుక్డే' రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం కొనసాగుతుంతుందని, పోలీసుల అరెస్టులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.






