- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది.. విద్యార్థులను పావులుగా వాడొద్దు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులు, యువత భావోద్వేగాలతో ఆడుకోవద్దని, వారిని రాజకీయ పావులుగా ఉపయోగించుకోవద్దని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులు, యువత భావోద్వేగాలతో ఆడుకోవద్దని, వారిని రాజకీయ పావులుగా ఉపయోగించుకోవద్దని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయ నాయకుల రెచ్చగొట్టే చర్యలు, సామాజిక ఉద్రిక్తతలకు పిల్లలను దూరంగా ఉంచాలని తల్లిదండ్రులను కోరారు. ఢిల్లీ ఘటనకు నిరసనగా గాంధీ భవన్ ఎదుట ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం సీఎం రేవంత్ రెడ్డి పిరికితనానికి, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అధికార మదంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భారత యువత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, భారత గణతంత్రం పక్షాన దృఢంగా నిలబడుతుందని తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. దేశ ప్రజలందరూ ఐక్యంగా నిలబడి పార్లమెంట్ గౌరవాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను, జాతీయ సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.






