- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ఒక్క ఓటు కూడా కోల్పోకూడదు
ఓటరు జాబితాలో అర్హులైన ఒక్క ఓటు కూడా కోల్పోకుండా అధికారులు, బీఎల్‌వోలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఎస్‌ఐఆర్ కార్యక్రమం హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తినేని వీరయ్య అన్నారు.

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : ఓటరు జాబితాలో అర్హులైన ఒక్క ఓటు కూడా కోల్పోకుండా అధికారులు, బీఎల్‌వోలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఎస్‌ఐఆర్ కార్యక్రమం హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తినేని వీరయ్య అన్నారు. బుధవారం పాలకవీడు మండలంలోని కల్మెట తండా, రావిపాడు, జాన్‌పహాడ్, మహంకాళిగూడెం గ్రామాల్లో జరుగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలతో సమావేశమైన ముత్తినేని వీరయ్య, పెండింగ్‌లో ఉన్న ఫారాల సేకరణను త్వరితగతిన పూర్తి చేసి డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఎన్యుమరేషన్ ఫారాలను సక్రమంగా నింపించి బీఎల్‌వోలకు అందేలా సహకరించాలని కోరారు. అవగాహన లేకపోవడం వల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి తలెత్తకుండా ప్రతి గ్రామంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆగస్టు 3లోగా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్యకర్తలు బాధ్యతాయుతంగా, సైనికుల్లా పనిచేసి ప్రతి అర్హ ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల కన్వీనర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాలోత్ మోతీలాల్ నాయక్‌తో పాటు కల్మెట తండా, రావిపాడు, మహంకాళిగూడెం గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు శోభన్, ప్రేమ్‌కుమార్, దావీదు, రాము, సైదా వీరన్న తదితరులు పాల్గొన్నారు.






