శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవాలయాన్ని సందర్శించిన చిన్న జీయర్ స్వామి

by Batti.Sumithra |

మండలంలోని బండ్లగూడెం గ్రామంలోని శ్రీ బండగుట్ట లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాన్ని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి బుధవారం సందర్శించారు.

శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవాలయాన్ని సందర్శించిన చిన్న జీయర్ స్వామి
X

దిశ, లింగాలఘణపురం : మండలంలోని బండ్లగూడెం గ్రామంలోని శ్రీ బండగుట్ట లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాన్ని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి బుధవారం సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 32 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహానికి, శంఖు-చక్ర నామాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే భక్తులకు ప్రవచనాలు వినిపించారు. శ్రీరాముడు మానవరూపుడైనా ఆయన ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పేవాడు కాదని, అసత్యాలు చెప్పేవాడు కాదని, నీతి-నిజాయితీతో పాలన సాగించాడని అన్నారు.

అందుకే ఆయనను దేవుడిగా కొలుస్తామని, ఆ దేవుడిని ఆదర్శంగా తీసుకుని మనుషులు కూడా నీతి, నిజాయితీతో జీవనం సాగించాలని సూచించారు. అప్పుడే మానవ జన్మకు సార్థకత చేకూరుతుందని చెప్పారు. బండగుట్ట లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనగామ బాణాపురం అర్చకులు శ్రీనివాసాచార్యులు, గ్రామ సర్పంచ్ పోరెడ్డి సంతోష్ మల్లారెడ్డి, వంచ మహేశ్వర్ రెడ్డి, లింగాల దీపక్ రెడ్డి, వంచ రాంరెడ్డి, కాటం కుమారస్వామి, గ్రామ ఉపసర్పంచ్ గట్టగల్ల నవీన్, వార్డు సభ్యులు చల్ల భూపాల్ రెడ్డి, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.

Next Story