- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ, కల్తీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్సై సతీష్
by Batti.Sumithra |
ఫర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాల యజమానులు నాసిరకం విత్తనాలు, కల్తీ ఎరువులు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పెద్దకొత్తపల్లి ఎస్సై వి. సతీష్, మండల వ్యవసాయ అధికారి శిరీష హెచ్చరించారు.

X
దిశ, పెద్దకొత్తపల్లి : ఫర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాల యజమానులు నాసిరకం విత్తనాలు, కల్తీ ఎరువులు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పెద్దకొత్తపల్లి ఎస్సై వి. సతీష్, మండల వ్యవసాయ అధికారి శిరీష హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రం పెద్దకొత్తపల్లిలోని ఫర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాలను టాస్క్‌ఫోర్స్ బృందం సందర్శించి తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం కేటాయించిన ధరలకే విక్రయించి, తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని సూచించారు.
Next Story






