‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెకండ్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెకండ్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన మేకర్స్ ఇప్పటికే మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసి.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘నేనో బటర్‌ఫ్లై’ అంటూ సాగే ఈ సాంగ్ చాట్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా.. ఇప్పటికీ నెట్టింట ట్రెండ్ అవుతూ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఈ నెల 25న రాబోతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా.. సూర్య ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేస్తున్న ఓ పోస్టర్ షేర్ చేసి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. కాగా.. ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

Next Story