వర్షాకాలం మహిళల్లో ఇన్ఫెక్షన్లు.. నివారణా మార్గాలు ఇవే..

by Sujitha Rachapalli |

వర్షా కాలం వేడిని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. కానీ అదే సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అనువైన పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్, తేమ, చెమట, తడి బట్టలు కలిసినప్పుడు.. చాలా మంది దురద, చికాకు, అసౌకర్యాన్ని అనుభవిస్తారు.

వర్షాకాలం మహిళల్లో ఇన్ఫెక్షన్లు.. నివారణా మార్గాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : వర్షా కాలం వేడిని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. కానీ అదే సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అనువైన పరిస్థితులను కూడా సృష్టిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్, తేమ, చెమట, తడి బట్టలు కలిసినప్పుడు.. చాలా మంది దురద, చికాకు, అసౌకర్యాన్ని అనుభవిస్తారు. వీటిని త్వరగా గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అసలు ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి? ఎలా నివారించాలి? చెప్తున్నారు.

బట్టలపై ఫంగస్

ఫంగస్ వెచ్చగా, తేమగా ఉండే వాతావరణంలో బాగా పెరుగుతుంది. వర్షాకాలంలో బట్టలు, లోదుస్తులు ఎక్కువసేపు తడిగా ఉంటాయి. అధిక చెమట, తడి బట్టలు, ప్రైవేట్ ఏరియాలో పేలవమైన గాలి ప్రసరణ ఫంగస్ వృద్ధిని ఎంకరేజ్ చేస్తాయి.

ప్యాడ్ ధరించినప్పుడు..

ఋతుస్రావ సమయంలో.. ముఖ్యంగా తేమగా ఉండే పరిస్థితుల్లో ఎక్కువసేపు శానిటరీ ప్యాడ్లు వాడటం వల్ల తేమ, చికాకు పెరిగి ఇన్ఫెక్షన్లు సులభంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మహిళలు యోని ప్రాంతంలో నిరంతర దురద, ఎర్రబడటం, చికాకుగా ఉండటం, మంటగా అనిపించడం, గట్టి తెల్లటి యోని స్రావం, నడుస్తున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు అసౌకర్యం, నొప్పితో మూత్రవిసర్జన ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

నివారణ చిట్కాలు

డయాబెటిస్ ఉన్నవారు, గర్భిణులు, తరచుగా యాంటీబయాటిక్స్ వాడేవారు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు, ఎక్కువసేపు టైట్ బట్టలు వేసుకునేవారిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. నిరంతర దురద, చికాకు.. నిద్ర, పని, వ్యాయామం, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు చెప్తున్నారు నిపుణులు.

* శానిటరీ ప్యాడ్లను 4-5 గంటలకొకసారి మార్చండి

* ప్రైవేట్ పార్ట్ ప్రాంతాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచండి. రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తులను వాడకండి.

* తడి బట్టల్లో ఎక్కువసేపు ఉండకండి

* వదులుగా ఉండే కాటన్ లోదుస్తులు వేసుకోండి

* స్ట్రాంగ్ స్మెల్ ఉండే హైజీన్ ఉత్పత్తులను నివారించండి

* చెమటలో తడిసిన జిమ్ బట్టలను వెంటనే మార్చండి

* డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిని బాగా నియంత్రించండి

* తగినంత నీళ్లు తాగండి.

నోట్ : ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది.

Next Story