‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేత.. అభిజీత్ దిప్కే తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

‘కాక్రోచ్ జనతా పార్టీ’ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కొద్దిసేపు నిలిచిపోవడం సంచలనం సృష్టించింది.

‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేత.. అభిజీత్ దిప్కే తీవ్ర ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కొద్దిసేపు నిలిచిపోవడం సంచలనం సృష్టించింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే తమ ఖాతాను నిలిపివేసిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తీవ్రంగా ఆరోపించారు. అయితే, అకౌంట్ నిలిచిపోయిన కొద్ది నిమిషాల్లోనే మళ్లీ పునరుద్ధరించబడింది.

‘ఎక్స్’ వేదికగా ఆరోపణలు

తమ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని అభిజీత్ దిప్కే ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే ఖాతా మళ్లీ అందుబాటులోకి వచ్చిందని ధృవీకరించారు. నీట్ (NEET) పేపర్ లీకేజీ, విద్యావ్యవస్థలోని లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే.

పార్లమెంట్ దాకా పాకిన వివాదం..

సీజేపీ పిలుపునిచ్చిన ‘చలో సంసద్’ మార్చ్‌లో ఢిల్లీ పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై పోలీసులు బలప్రయోగం చేశారని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో కేంద్రాన్ని తీవ్రంగా ఎండగట్టాయి. ఈ రాజకీయ దుమారం కొనసాగుతున్న తరుణంలోనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నిలిపివేత ఘటన చోటుచేసుకుంది.

Next Story