నా అవయవాలను దానం చేయండి

by Taduka Kalyani |

నా అవయవాలు పనిచేస్తే అవసరమైన వారికి దానం చేయాలని, అలా కాకుండా మృతి చెందినట్లయితే నా శరీరాన్ని శాస్త్రీయ పరిశోధన ప్రయోగాలకు విరాళంగా ఇవ్వాలని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

నా అవయవాలను దానం చేయండి
X

దిశ, నర్సాపూర్ : నా ఆత్మహత్య అనంతరం నా అవయవాలు పనిచేస్తే అవసరమైన వారికి దానం చేయాలని, అలా కాకుండా మృతి చెందినట్లయితే నా శరీరాన్ని శాస్త్రీయ పరిశోధన ప్రయోగాలకు విరాళంగా ఇవ్వాలని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లింగోజి తండా కు చెందిన మేతిపోలే శివశంకర్ (20) నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీ వీ ఆర్ ఐ టి కళాశాలలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతనితోపాటు ముగ్గురు స్నేహితులు నర్సాపూర్ పట్టణంలోని సిటీ ప్యాలెస్ వద్ద రూమ్ లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం నాడు శివకుమార్ రూమ్ లో స్నేహితులు లేని సమయంలో నైలాన్ తాడుతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు శివశంకర్ తన మిత్రుడికి ఇన్స్టాగ్రామ్ లో సూసైడ్ నోట్ పంపించడం జరిగింది. అందులో చాలా కాలం నుండి చనిపోవాలని విఫలమయ్యానని పేర్కొన్నాడు. తన ఇష్టానుసారంగానే చనిపోతున్నానని, తన తల్లిదండ్రులు చాలా సపోర్ట్ చేశారని, తనకు ప్రేమ జీవితం కూడా లేదని, ఎందుకు చనిపోవాలనుకుంటున్నాను వివరించలేనని చెప్పుకొచ్చాడు. ఆత్మహత్య అనంతరం బ్రతికి ఉంటే అవయవాలు ఏవైనా పనిచేస్తుంటే వాటిని అవసరమైన వారికి దానం చేయాలని, ఒకవేళ మరణిస్తే శరీరాన్ని శాస్త్రీయ పరిశోధన మరియు ప్రయోగాలకు విరాళంగా ఉచితంగా ఇవ్వాలని పేర్కొన్నాడు. నేను తీసుకున్న ప్రతి నిర్ణయానికి చింతిస్తున్నానని, ఒక నిర్ణయం కూడా మంచిది కాదని చెప్పుకొచ్చాడు. మృతుడు తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ వెల్లడించారు.

Next Story