- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. రాబోయే 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు
నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపు కూడా రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి వర్షం పడే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తడిసిముద్దైన భాగ్యనగరం..
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని ప్రధాన వీధులు జలమయమవ్వడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, కృష్ణానగర్, ఫిలింనగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్ ప్రాంతాల్లో జోరుగా వర్షం ఇంకా పడుతూనే ఉంది. అదేవిధంగా సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్ తదితర ప్రాంతాల్లోనూ వాన దంచికొడుతోంది. హఠాత్తుగా కురిసిన వర్షంతో ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లు (DRF) అప్రమత్తమయ్యాయి. వర్షపు నీటిని తొలగించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. రాబోయే మరో 2 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది.






