HCAలో మరో కీలక పరిణామం.. టీమ్ హెడ్ కోచ్‌గా అనిరుధ్ నియామకం

by Kema Shiva Kumar |

జాతీయ స్థాయిలో హైదరాబాద్ జట్టు బలోపేతమే లక్ష్యంగా హెచ్‌సీఏ కీలక నిర్ణయం తీసుకున్నది.

HCAలో మరో కీలక పరిణామం.. టీమ్ హెడ్ కోచ్‌గా అనిరుధ్ నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ మెన్ జట్టు హెడ్ కోచ్‌గా హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్’ ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన అశ్విన్ అనిరుధ్‌ను నియమించారు. అదేవిధంగా బౌలింగ్ కోచ్‌గా ఆల్ఫ్రెడ్ అఫ్ సలామ్‌కు బాధ్యతలు కట్టబెట్టారు. ఇక అండర్-16 బౌలింగ్ కోచ్‌గా ముషారఫ్‌ను నియమిస్తూ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. కాగా, ఇటీవల ముగిసిన టీజీ20 (TG20) లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచిన ‘హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్’ కోచింగ్ వర్గానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఇచ్చే ప్రాధాన్యత పెరిగింది. లీగ్‌లో జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌ల సేవలను గుర్తించిన హెచ్‌సీఏ, వారిని వివిధ రాష్ట్ర జట్లకు కోచ్‌లుగా నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story