ఫీల్డ్ అసిస్టెంట్‌పై దాడి యత్నం.. ఐదుగురిపై కేసు నమోదు

by Ratna Kumari |

లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గంట లక్ష్మణ్‌పై దాడికి యత్నించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు.

ఫీల్డ్ అసిస్టెంట్‌పై దాడి యత్నం.. ఐదుగురిపై కేసు నమోదు
X

దిశ, లింగంపేట : లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గంట లక్ష్మణ్‌పై దాడికి యత్నించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు. వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని అటవీ భూమిలో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ప్లాంటేషన్ ఏర్పాటు చేసి, కూలీలతో సుమారు వెయ్యి మొక్కలు నాటించారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ఆ మొక్కలను ధ్వంసం చేసినట్లు సమాచారం అందడంతో ఫీల్డ్ అసిస్టెంట్ గంట లక్ష్మణ్ ప్లాంటేషన్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆగపల్లి తండాకు చెందిన ధరావత్ శివలాల్, ధరావత్ మున్యా, ధరావత్ పూల్‌సింగ్, ధరావత్ వినోద్, కడావత్ సవాయి అనే ఐదుగురు తనపై దాడికి యత్నించినట్లు గంట లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దీపక్ కుమార్ వెల్లడించారు.

Next Story