పొంగులేటి కాదు.. కమీషన్ రెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి

by Vemula.Srinu Prasad |

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కమీషన్ రెడ్డిగా మారారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ...

పొంగులేటి కాదు.. కమీషన్ రెడ్డి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కమీషన్ రెడ్డిగా మారారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కరువు పరిస్థితులపై పొంగులేటి, పొన్నం సమీక్ష చేశారని.. దేవాదుల పంపులు ఆన్ చేయమంటే తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మేడారంలో రివ్యూ పెట్టి దేవాదుల కింద ఉన్న రిజర్వాయర్లను నిపుతామని అన్నారని.. ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని ఆరోపించారు.

అంతేకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షకు ఇద్దరు మంత్రులు హాజరు కాలేదని.. గిరిజన మంత్రి, బీసీ మంత్రి అని ఇద్దరు మహిళా మంత్రులపై పొంగులేటి కక్ష కట్టారా అని ప్రశ్నించారు. ఇన్‌చార్జి మంత్రి పొంగులేటితో ఉమ్మడి వరంగల్ జిల్లాకు శని పట్టిందన్నారు. అటు ఇటు కాని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని.. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారని పేర్కొన్నారు. ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంట్రాక్టు వర్కులు చేస్తున్నారని.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలకు ఒకరంటే ఒకరికి పడదని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు వచ్చి దేవాదుల వద్ద దావత్ చేసుకుని వెళ్తున్నారని ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేవాదులపై ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ ఒత్తిడితోనే దేవాదుల మోటార్లు ఆన్ చేశారని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవివేకి, అహంకారి, అవినీతిపరుడని ఆరోపించారు. సిగ్గు లేని ఉత్తమ్‌‌కు ఇంకా సిగ్గు రాలేదని.. హరీశ్‌రావుకు ఇరిగేషన్ లేదనడం బుద్ధి మాంద్యమని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, బీఆర్ఎస్ నేత లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

Next Story