సైబర్ మోసాలకు గురైన బాధితులకు గుడ్‌న్యూస్..

by Kodari Anjali |

సైబర్ నేరాల బారినపడి తమ డబ్బును కోల్పోయిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) శుభవార్త అందించింది.

సైబర్ మోసాలకు గురైన బాధితులకు గుడ్‌న్యూస్..
X

దిశ, ఎల్లారెడ్డిపేట: సైబర్ నేరాల బారినపడి తమ డబ్బును కోల్పోయిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) శుభవార్త అందించింది. సైబర్ మోసాలకు గురైన బాధితులు తమ నష్టపోయిన నగదును సులభంగా తిరిగి పొందేందుకు మనీ రిస్టోరేషన్ మాడ్యూల్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. TGCSB డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయెల్, IPS తెలిపిన వివరాల ప్రకారం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) నుండి రీఫండ్‌కు సంబంధించిన SMS లేదా నోటిఫికేషన్ అందుకున్న అర్హులైన బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో MRM ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చట్ట అమలు సంస్థలు, సంబంధిత బ్యాంకుల ధృవీకరణ అనంతరం అర్హులైన బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయబడుతుంది.

రీఫండ్ కోసం దరఖాస్తు విధానం:...

సైబర్ క్రైమ్ ఫిర్యాదుకు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో పోర్టల్‌లో లాగిన్ కావాలి.

OTP ద్వారా గుర్తింపును ధృవీకరించాలి.

అర్హత కలిగిన ఫిర్యాదు మరియు సంబంధిత బ్యాంకు ఖాతాను ఎంపిక చేసుకోవాలి.

అవసరమైతే PAN కార్డు వివరాలను అప్లోడ్ చేయాలి.

వివరాలను పరిశీలించి రీఫండ్ అభ్యర్థనను సమర్పించాలి.

అభ్యర్థన విజయవంతంగా నమోదైనట్లు సందేశం వచ్చిన తర్వాత, ధృవీకరణ పూర్తయిన అనంతరం నగదు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.

ప్రజలకు సూచనలు...

సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో వెంటనే ఫిర్యాదు నమోదు చేయండి. సమయానికి ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయి. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్‌లో కలవాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె.రాహుల్ రెడ్డి ప్రజలకు సూచించారు.

Next Story