- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ భవన్‌లో దాశరథి జయంతి
తెలంగాణ భవన్‌లో దాశరథి కృష్ణమాచార్యులు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని తెలంగాణ వ్యాప్తంగా చైతన్యం నింపిన కవి దాశరథి అని కొనియాడారు. ..

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌లో దాశరథి కృష్ణమాచార్యులు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రత్నాలవీణ అని తెలంగాణ వ్యాప్తంగా చైతన్యం నింపిన కవి దాశరథి అని కొనియాడారు. దాశరథి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని.. ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. దాశరథి ఆలోచన విధానాన్ని ఎల్లప్పుడూ ముందుకు తీసుకెళ్లారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలో అగ్రగామిగా కేసీఆర్ నిలబెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాలోతు కవిత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
24న కేసరి కుస్తీ పోటీలు
ఈ నెల 24న తెలంగాణ భవన్‌లో కేసరి కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను తలసాని బుధవారం పరిశీలించారు. 5 వేల ఏళ్ల చరిత్ర కలిగిన కుస్తీ పోటీలను ఆదరించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. కుస్తీ పోటీలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైన వారికి తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రాక్, షూస్, ట్రాన్స్‌పోర్ట్ చార్జీలను అందిస్తామని తెలిపారు. నగరంలోని 70 అఖాడాల(వ్యాయామశాల)కు కుస్తీ పోటీల ప్రాక్టీస్‌కు అవసరమైన మ్యాట్‌లను అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెజ్లర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.






