విద్యార్థులకు వైఆర్‌పీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు

by Vemula.Srinu Prasad |

వైఆర్‌పీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని వైష్ణోయి గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో వార్షిక స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది...

విద్యార్థులకు వైఆర్‌పీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైఆర్‌పీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని వైష్ణోయి గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో వార్షిక స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. 2026–27 విద్యా సంవత్సరానికి మొత్తం 187 మంది విద్యార్థులకు రూ.74 లక్షల స్కాలర్‌షిప్‌లు అందజేశారు. హైదరాబాద్, నల్గొండ సహా.. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, డిగ్రీ, ఇంటర్, పాఠశాల విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లను పొందారు.

ఈ సందర్భంగా యెలిశాల రవి ప్రసాద్ మాట్లాడుతూ.. విద్య ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు, కుటుంబాన్ని, సమాజాన్ని కూడా మార్చగలదని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నారు. ఇప్పుడు సాయం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో మరో అవసరమైన విద్యార్థికి అండగా నిలవాలని, అదే నిజమైన సామాజిక సేవ అని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి జె.పూర్ణచంద్రరావు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎం.జగదీశ్వర్ అతిథులుగా పాల్గొన్నారు. విద్యా రంగంలో వైఆర్‌పీ ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందించారు.

Next Story