- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నీట్’పై పార్లమెంట్లో చర్చకు సిద్ధం.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వం ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నడ్డా హామీ ఇచ్చారు.

దిశ, వెబ్డెస్క్: నీట్ (NEET) పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలను, సమస్యలను రాజకీయంగా వాడుకోవడం దుురదృష్టకరమని కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి విద్యార్థుల సంక్షేమంపై శ్రద్ధ లేదని అన్నారు. కేవలం ‘నీట్’ అంశంతో విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం (Political Mileage) పొందాలని మాత్రమే చూస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. అయినా ‘నీట్’పై పార్లమెంట్లో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, తెలంగాణలో ఇంటర్ పేపర్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో పేపర్లు లీక్ జాబితా చాలానే ఉందని జేపీ నడ్డా ధ్వజమెత్తారు.
‘నీట్’ పేపర్ లీక్ అంశంపై తమ ప్రభుత్వం బాధ్యతయుతంగా వ్యవహరిస్తోందని జేపీ నడ్డా అన్నారు. కొన్ని అంశాలను టార్గెట్గా చేసుకుని రాహుల్ గాంధీ రాజీకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలు చీటికిమాటికి గోల్ పోస్టు మారుస్తున్నామని అన్నారు. ఇది రాజకీయ పోరాటాలు చేయడానికి సరైన సమయం కాదని, ఈ తీవ్రమైన అంశాన్ని చర్చించడానికి పార్లమెంట్ సరైన వేదిక జేపీ నడ్డా స్పష్టం చేశారు.






