- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jana Nayagan: పూజాకు బిగ్ షాక్...పాత్ర నిడివి తగ్గింపు !
జన నాయగన్ సినిమాలో పూజా పాత్ర నిడివి తగ్గించినట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ నటించిన జన నాయగన్ జూలై 23వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డేకు ఊహించని షాక్ తగిలింది. ఎడిటింగ్ లో భాగంగా ఆమె పాత్ర నిడివి చాలా తగ్గించారట. సినిమా తీసేటప్పుడు, పూజా హెగ్డే పాత్ర చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఎడిటింగ్ లో భాగంగా విజయ్ పాత్రను హైలెట్ చేసేందుకుగాను..ఆమె పాత్రను తగ్గించినట్లు టాక్ నడుస్తోంది. దర్శకుడు వినోద్ సూచనలను మేరకు పాత్ర నిడివి తగ్గించారట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించగా... వినోద్ దర్శకత్వం వహించారు. కాగా విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్ లో ఇప్పటికే బీస్ట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో జన నాయగన్ రెండో సినిమా.






