- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవితం పై మనస్థాపం చెంది వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య
by Taduka Kalyani |
జీవితం పై మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, రాజేంద్రనగర్ : జీవితం పై మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మత్తు యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం...అస్సాం కు చెందిన ప్రశాంత్ (29) బతుకుదెరువు కోసం వలస వచ్చి బండ్లగూడ జాగీర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో దినసరి కూలీగా పని చేస్తున్నాడు.ప్రశాంత్ అస్సాం లో ఉన్న తన భార్య తో ఫోన్ లో గోడవ పడ్డాడు. దింతో జీవితం పై మనస్థాపం చెంది బుధవారం అపార్ట్ మెంట్ లోని ఓ సజ్జకు ప్లాస్టిక్ తాడు తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.భార్య భర్తలు గత కొంత కాలంగా వేరు వేరుగా ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది.
Next Story






