- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు : కలెక్టర్
by Taduka Kalyani |
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు.

X
దిశ, చిన్నకోడూరు: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. బుధవారం మండల పరిధిలోని అల్లిపూర్ లోని అనంతగిరి రిజర్వాయర్ సమీపంలో, కిష్టాపూర్ గ్రామ శివారులోని ఇల్లంతకుంట రహదారిని ఆనుకుని ఉన్న సుమారు 10 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆక్రమణలకు అవకాశం లేకుండా వెంటనే సర్వే పూర్తి చేసి పక్కాగా హద్దులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ సలీంను ఆదేశించారు. ఆమె వెంట జి పి ఓ లు కవిత, కృష్ణ వేణీ తదితరులున్నారు.
Next Story






