- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చలో రాజ్‌భవన్ నిరసనకు భారీగా కదం తొక్కిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ నిరసన కార్యక్రమం చేపట్టారు.

దిశ, జూబ్లీహిల్స్: ఏఐసీసీ దేశవ్యాప్త పిలుపు మేరకు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇతర ప్రతిపక్ష నాయకుల అరెస్టును ఖండిస్తూ, అలాగే నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ నిరసన కార్యక్రమం చేపట్టారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి రాజ్‌భవన్ వరకు నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదే విధంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని నిరసనను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు విద్యార్థుల హక్కులను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.






