- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి సంరక్షణ పనులను పెద్ద ఎత్తున చేపట్టాలి: కలెక్టర్
గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

దిశ, పెద్దపల్లి: సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలను పరిరక్షించడం అత్యంత ప్రాధాన్యమని, తెలంగాణ జలసిరి కార్యక్రమం, వీబీజీ రామ్ జీ పథకం ద్వారా నీటి సంరక్షణ నిర్మాణాలను గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో తెలంగాణ జలసిరి కార్యక్రమం, వీబీజీ రామ్ జీ పథకం అమలు పై ఎంపీడీవోలతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల్లో చేపట్టాల్సిన నీటి సంరక్షణ పనులు, స్థలాల గుర్తింపు, పరిపాలనా అనుమతులు, పనుల ప్రారంభంపై అధికారులకు పలు దిశానిర్దేశాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్ జీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు సంబంధించిన నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామంలో ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
భూగర్భ జలాలను పెంపొందించే..
గ్రామీణ ప్రాంతాల్లో పంట కుంటలు, ఇంకుడు గుంతలు, ఊట కుంటలు, బోరు బావుల రీఛార్జ్ నిర్మాణాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించి, పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, ఆగస్టు 1వ తేదీ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టే విధంగా నీటి సంరక్షణ చర్యలను మిషన్ మోడ్‌లో అమలు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. భూగర్భ జలాలను పెంపొందించే ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నీటి సంరక్షణ నిర్మాణాల అమలులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పనులు నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేసేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామపంచాయతీలు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్,డి.ఆర్.డి.ఓ. కాళిందిని, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు , తదితరులు పాల్గొన్నారు.






