ప్రభుత్వ భవనాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

by Kodari Anjali |

జగిత్యాల జిల్లా రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల పనులను బుధవారం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రభుత్వ భవనాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్
X

దిశ, జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లా రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల పనులను బుధవారం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా గుల్లపేట గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రాథమిక పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు పనులను తనిఖీ చేశారు. భవన నిర్మాణ పనులను నిర్దేశిత ప్రమాణాలతో చేపట్టాలని విద్యార్థులకు మెరుగైన విద్య వాతావరణం కల్పించేలా అన్ని సౌకర్యాలతో పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో నిర్మాణం అవుతున్న పల్లె దావఖాన నూతన భవనం నిర్మాణాలను పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పల్లె దావఖాన భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మహిళా సంఘాల కార్యకలాపాలకు ఉపయోగపడే వీవో భవనాలను అన్ని మౌలిక సదుపాయాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్న ప్రతి ప్రభుత్వ భవనం దీర్ఘకాలం ఉపయోగపడేలా నిర్మించాలని పనులను నిరంతరం పరిరక్షిస్తూ నిర్ణీత గడువు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు ఈ పరిశీలనలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ రూరల్ తహసీల్దార్ హకీమ్ అధికారులు ఇంజనీరింగ్ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story