- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోడుప్పల్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాల జోరు..
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దిశ, మేడిపల్లి : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఎస్‌ఐఆర్ (SIR) పనుల్లో బిజీగా ఉండటంతో, అనుమతులకు విరుద్ధంగా అక్రమ షెడ్లు, పెంట్‌హౌస్‌లు, సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మాణాలు వేగంగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా బోడుప్పల్ సర్కిల్ 9వ డివిజన్‌లోని శ్రీ సాయినగర్ కాలనీలో జీ+2 అనుమతులు మాత్రమే ఉన్న భవనం పై అక్రమంగా పెంట్‌హౌస్ నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు చర్యలు తీసుకునేలోపే నిర్మాణాలు పూర్తవుతున్నాయని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాల పై వెంటనే తనిఖీలు నిర్వహించి, బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు అనేకం ఇప్పటికే పూర్తయ్యాయని వారు వాపోతున్నారు.






