అభిమానులకు ‘రణబాలి’ షాక్!

by Chukka Sudharani |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటిస్తున్న మూవీ ‘రణబాలి’.

అభిమానులకు ‘రణబాలి’ షాక్!
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటిస్తున్న మూవీ ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి అయిన తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. స్టార్టింగ్‌లో సెప్టెంబర్ 11న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ, ఇటీవల షూటింగ్ షెడ్యూల్ ఆలస్యం కావడంతో నిర్ణయించిన తేదీకి చిత్రాన్ని పూర్తి చేయడం కష్టమనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా.. ఇటీవల దర్శకులు రాహుల్ సాంకృత్యాన్ పుట్టిన రోజు స్పెషల్‌గా విడుదల చేసిన పోస్టర్‌లో విడుదల తేదీ (సెప్టెంబర్ 11) మెన్షన్ చేయకపోవడంతో విడుదల వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. కాగా.. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో రణబాలి అనే వీరుడిగా విజయ్ నటిస్తుండగా.. ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక కనిపించనున్నారు. అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Next Story