రేవల్లిలో ట్రాక్టర్, కారు ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం

by Batti.Sumithra |

రేవల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న మూలమలుపు వద్ద బుధవారం ట్రాక్టర్, స్విఫ్ట్ డిజైర్ కారు ఎదురెదురుగా ఢీకొనగా, వాహనాలు దెబ్బతిన్నప్పటికీ వాటిలో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది.

రేవల్లిలో ట్రాక్టర్, కారు ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, రేవల్లి : రేవల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న మూలమలుపు వద్ద బుధవారం ట్రాక్టర్, స్విఫ్ట్ డిజైర్ కారు ఎదురెదురుగా ఢీకొనగా, వాహనాలు దెబ్బతిన్నప్పటికీ వాటిలో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం పోలీస్ స్టేషన్ సమీపంలోని వెల్డింగ్ షాప్ ఎదుట మరమ్మత్తుల కోసం భారీ వాహనాలు, ట్రాక్టర్లను రహదారిపైనే నిలిపివేయడం వల్ల మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించడం లేదని తెలిపారు.

దీంతో అతివేగం, అజాగ్రత్తతో వచ్చిన ట్రాక్టర్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రాంతంలో తరచూ భారీ వాహనాలను రహదారిపై నిలిపివేయడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందున్న మూలమలుపు వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే, మూలమలుపు వద్ద హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Next Story