పాన్ షాపులు తెరిచి ఉంచిన ఇరువురిపై కేసు నమోదు..

by Kodari Anjali |

పాన్ షాపులు తెరిచి ఉంచిన ఇద్దరు వ్యక్తులపై హయత్‌నగర్ పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు.

పాన్ షాపులు తెరిచి ఉంచిన ఇరువురిపై కేసు నమోదు..
X

దిశ, చైతన్యపురి: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి వేళల్లో పాన్ షాపులను నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉంచడం, నేరస్థులు అనుమానాస్పద వ్యక్తులు రోడ్లపై సంచరించే పరిస్థితులు కల్పించడం ద్వారా ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగిస్తుంది. కాగా ఈ విధంగా వ్యవహరించిన గుడెల్లి యాకయ్య, సయ్యద్ ఇర్ఫాన్ అను ఇద్దరు వ్యక్తులపై హయత్‌నగర్ పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. వీరిని బుధవారం న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా.. కేసు విచారించిన న్యాయస్థానం ఇద్దరికీ రెండురోజుల సాధారణ కారాగార శిక్ష విధించిందని ఇన్స్ పెక్టర్ చింత శంకరయ్య తెలిపారు.

Next Story