రోడ్డు ప్రమాద బాధితుడికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సహాయం

by Ratna Kumari |

కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు విరగడంతో ఇంటికే పరిమితమైన గోపాలరావుపేట గ్రామానికి చెందిన సూర ఎల్లారావును బుధవారం పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.

రోడ్డు ప్రమాద బాధితుడికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సహాయం
X

దిశ, పినపాక : కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు విరగడంతో ఇంటికే పరిమితమైన గోపాలరావుపేట గ్రామానికి చెందిన సూర ఎల్లారావును బుధవారం పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేరం వెంకటేశ్వర్లు, మండల ఉపసర్పంచ్‌ల సంఘం నాయకులు బాధితుడి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లారావు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని కుటుంబానికి రూ.6 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎల్లారావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిరుపేద కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని, పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న ఎల్లారావును ఆదుకునేందుకు దాతలు, ప్రజలు ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపసర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు దాట్ల రాజేష్, ఉపాధ్యక్షుడు అచ్చా నవీన్, ప్రధాన కార్యదర్శి కోడం రామ్మోహన్, ఆరె స్రవంతి, గంగిరెడ్డి సందీప్ రెడ్డి, ఆకుల సందీప్, నిట్టా శిరీష, రావిల్ల నర్సమ్మ (చిట్టీమల్ల ప్రసాద్), మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఊడుగుల లక్ష్మారెడ్డి, పొనుగోటి చందర్రావు, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story