- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడిరోడ్డుపై ఆగిపోయిన కారు.. ఆర్మీ జవాన్ చేసిన పనికి యువతి ఫిదా!
విద్యుత్ వాహనం నడుపుతున్నప్పుడు మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్ వాహనం (EV) నడుపుతున్నప్పుడు మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితినే ఎదుర్కొన్న ఓ యువతికి భారత ఆర్మీ జవాన్ ఆపద్బాంధవుడిలా సాయం చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
ప్రముఖ కంటెంట్ క్రియేటర్, వ్లాగర్ అయిన దీపికా శర్మ ఇటీవల తన ఈవీలో ప్రయాణిస్తున్నారు. అయితే, కారులో ఛార్జింగ్ ఎంతుందో అంచనా వేయడంలో ఆమె పొరపాటు పడటంతో.. కారు నడిరోడ్డుపై ఆగిపోయింది. చుట్టుపక్కల ఛార్జింగ్ స్టేషన్ కూడా లేకపోవడం, ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె ఆందోళనకు గురైంది. ఆ సమయంలో అటుగా వచ్చిన నరేంద్ర అనే ఆర్మీ జవాన్ ఆమెకు సాయంగా నిలిచారు. కారును తోసుకుంటూ.. ఏమాత్రం ఆలోచించకుండా జవాన్ నరేంద్ర రంగంలోకి దిగి, ఆగిపోయిన ఆమె కారును సమీపంలోని ఈవీ ఛార్జింగ్ స్టేషన్ వరకు స్వయంగా తోసుకుంటూ వెళ్లారు. కేవలం కారును తోసి వదిలేయకుండా.. కారుకు తగినంత ఛార్జింగ్ ఎక్కి, ఆమె సురక్షితంగా ప్రయాణం ప్రారంభించేంతవరకు ఆయన అక్కడే తోడుగా వేచి ఉన్నారు. వెళ్లే ముందు ఆమెకు సరైన మార్గాన్ని కూడా సూచించారు.
‘హీరోలు ఆర్మీ యూనిఫాంలో ఉంటారు’
ఈ హృదయపూర్వక ఘటనను దీపికా శర్మ వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘కొందరు హీరోలు క్యాప్స్ ధరించరు.. భారత సైనిక యూనిఫాం ధరిస్తారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. జవాన్ నరేంద్ర చూపించిన సహనం, నిస్వార్థమైన సాయాన్ని తానెన్నటికీ మర్చిపోలేనని కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యంతో పాటు మానవత్వంతో దేశానికి సేవలందిస్తున్న భారత సైన్యానికి ఈ వీడియోను అంకితం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. జవాన్ చేసిన సాయం, సాయుధ దళాల సేవాభావంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.






