ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ బాధితులకు అండగా ఉంటాం..

by Kodari Anjali |

కొల్లమద్ది గ్రామంలోని ఎస్సీ కాలనీ షార్ట్ సర్క్యూట్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తెలిపారు.

ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ బాధితులకు అండగా ఉంటాం..
X

దిశ, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామంలోని ఎస్సీ కాలనీ షార్ట్ సర్క్యూట్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరపున మరియు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు తెలిపారు. బుధవారం రోజున కొల్లమద్ది గ్రామంలో షార్ట్ సర్క్యూట్ బాధితుల కుటుంబాల వద్దకు వెళ్లి పర్శ హన్మాండ్లు పరామర్శించారు. జరిగిన ప్రమాద వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంరం పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ.. మొన్నటి రోజున జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా 71 దళిత కుటుంబాలలో 53 మీటర్లు, 12 ఫ్రిడ్జ్లు, 50 టీవీలు, 65 ఫ్యాన్ లు 150 బల్బులు, ఒక ల్యాప్ టాప్, ఒక గ్లిసర్ కాలిపోయి బుగ్గిపాలు అయ్యాయి అని బుగ్గిపాలైన వస్తు సామాగ్రి విలువ దాదాపు 30 లక్షల వరకు ఉంటుందని పర్శ హన్మాండ్లు తెలిపారు.

పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి..

ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగడం దురదృష్టకరం బాధాకరం అన్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగితే వెంటనే సబ్ స్టేషన్‌లో ట్రిప్ అయి విద్యుత్ సరఫరా ఆగిపోవాలని అలా జరగక 15 నిమిషాలు విద్యుత్ సరఫరా ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని పర్ష హన్మాండ్లు తెలిపారు. విద్యుత్ అధికార్ల నిర్లక్ష్యం ఉన్నట్లు అనిపిస్తున్నదని పర్ష హన్మాండ్లు అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను పర్శ హన్మాండ్లు కోరారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే ఎన్ పి డి సీ ఎల్ ఎస్ ఈ, జిల్లా కలెక్టర్ గార్లతో మాట్లాడినారని స్పందించిన అధికారులు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారనీ పర్శ హన్మాండ్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్ష హన్మాండ్లు వెంట గ్రామ సర్పంచ్ దిలీప్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజాగౌడ్, మహిపాల్, నర్సింలు, ధర్మయ్య, శ్రీనివాస్, రాజయ్య, రామస్వామి, నర్సింగా రావు, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Next Story