- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
24 గంటల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడు అరెస్ట్
మండల కేంద్ర పరిధిలోని సంగపూర్ గ్రామంలో ఈ నెల 18న జరిగిన చోరీ కేసును రాయికోడ్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.

దిశ, రాయికోడ్: మండల కేంద్ర పరిధిలోని సంగపూర్ గ్రామంలో ఈ నెల 18న జరిగిన చోరీ కేసును రాయికోడ్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి రూ.11 వేల విలువ గల 20 తులాల వెండి పట్టీలు, రూ.25 వేల విలువ గల శాంసంగ్ స్మార్ట్ ఫోన్‌ను అపహరించాడు. ఈ విషయంపై అదే గ్రామానికి చెందిన బాధితుడు కాలి మొళ్ల నాగేష్ బుధవారం రాయికోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రాయికోడ్ ఎస్ఐ చైతన్య కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సమాచారంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అదే గ్రామానికి చెందిన మడిగడ్డ బస్వరాజు చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. 24 గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసుల చర్యను న్యాయస్థానం అభినందించింది.






