సాయికృష్ణ కేసు: జైలులో నాగరాజుకు విచారణ

by Vemula.Srinu Prasad |

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ లాకప్ డెత్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగరాజు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు...

సాయికృష్ణ కేసు:  జైలులో నాగరాజుకు విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌(Vijayawada Krishnalanka Police Station)లో గాదె సాయికృష్ణ(Gade Saikrishna) లాకప్ డెత్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగరాజు(Former CI Nagaraju) ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు ఈ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నాగరాజును జైలులో మెజిస్ట్రీరియల్ టీమ్ విచారించింది. నాగరాజు లాకప్ డెత్‌పై మూడు గంటలపాటు ప్రశ్నించింది. సీఐ నాగరాజు నుంచి కొన్ని వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ కేసులో రాష్ట్ర డీజీపీ, విజయవాడ సీపీ, ఏసీపీని నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. గురుమూర్తి పిటిషన్ ప్రైవేటు దాఖలు చేశారని, తిరస్కరించాలని ధర్మసనాన్ని కోరారు. అయితే గత తీర్పును ఆధారంగా చేసుకునే ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు గురుమూర్తి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అంతేకాదు సిట్ విచారణపై అనుమానం వ్యక్తం చేశారు. పారదర్శకంగా జరగడంలేదని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణ వాయిదా వేసింది.

Next Story