జిల్లా పర్యాటక అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి : కలెక్టర్

by Taduka Kalyani |

మెదక్ జిల్లా పర్యాటక అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.

జిల్లా పర్యాటక అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి : కలెక్టర్
X

దిశ, మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా పర్యాటక అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో గత ఐదు రోజుల నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యటించిన పర్యాటక కన్సల్టెంట్ శవంతి గుప్త, భువన్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రమేష్, ఈ డి యం సందీప్ తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

గత ఐదు రోజులుగా మెదక్ జిల్లా వ్యాప్తంగా నర్సాపూర్ అర్బన్ పార్క్, మెదక్ ఖిల్లా, మెట్ల బావి, బార కమాన్, పోచారం, వేల్పుగొండ తుంబురేశ్వర ఆలయం, చందంపేట, పాపన్నపేట కోటలు, కోముటూరు మజీద్, లను పరిశీలించి, వారి అనుభవాలను పర్యాటకశాఖ కన్సల్టెంట్ శవంతి గుప్త, భువన్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ, ప్రదేశాలుగా విభజించి జిల్లా పర్యాటక అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అందరి సహకారంతో టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story