- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్: మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో గేట్లు రీఓపెన్
దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతల వేళ మూసివేసిన మెట్రో స్టేషన్ల గేట్లను రీఓపెన్ అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని కీలక మెట్రో స్టేషన్లైన మండి హౌస్ (Mandi House), సెంట్రల్ సెక్రటేరియట్ (Central Secretariat) వద్ద తాత్కాలికంగా మూసివేసిన ఎంట్రెన్స్ గేట్లను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) రీఓపెన్ చేసింది. భద్రతా కారణాలు, ప్రయాణికుల రద్దీ నియంత్రణ చర్యల్లో భాగంగా వీటిని తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, సాంస్కృతిక కేంద్రాలకు నిలయమైన ఈ రెండు ఇంటర్‌చేంజ్ స్టేషన్లలో రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎంట్రీ గేట్లను మూసివేయడం వల్ల గత కొంతసేపటి నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా డీఎంఆర్‌సీ గేట్లను తెరవడంతో ప్రయాణం మళ్లీ యథావిధిగా సాగుతోంది. రైలు సర్వీసులు అన్ని లైన్లలోనూ సాధారణంగానే నడుస్తున్నాయని, ఎలాంటి ఆటంకాలు లేవని డీఎంఆర్‌సీ ప్రకటన విడుదల చేసింది.






