- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రెక్కింగ్ చేస్తూ... 500 అడుగుల లోయలో పడిన యువకుడు
by velandi.Saikiran |
కేరళలో ట్రెక్కింగ్ చేస్తూ 500 అడుగుల లోయలో ఓ యువకుడు పడిపోయాడు.

X
దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ట్రెక్కింగ్ చేస్తూ ఓ యువకుడు 500 అడుగుల లోయలో ప్రమాదవ శాత్తు పడిపోయాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలో ట్రెక్కింగ్ చాలా మంది చేస్తూంటారు. వేలాది సంఖ్యలో పర్యాటకులు అక్కడి వచ్చి, వాతావరణం ఎంజాయ్ చేస్తారు. ఈ తరుణంలోనే కేరళలోని కొలుక్కుమళై కొండపై సూర్యోదయం చూసేందుకు చెన్నై పర్యాటకుడు కార్తీక్ వెళ్లాడు. ఈ క్రమంలోనే ట్రెక్కింగ్ చేస్తూ, 500 అడుగుల లోయలో పడ్డాడు. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు, ఐదు గంటల పాటు శ్రమించి కార్తీక్‌ను సురక్షితంగా రక్షించాయి. తీవ్ర గాయాలతో ఉన్నకార్తీక్ ను ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






