సమయం ఉంది.. ఆన్‌లైన్ డిజిటలైజేషన్‌లో తప్పులు ఉండరాదు : అదనపు కలెక్టర్ శ్రీను

by Batti.Sumithra |

ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిన నేపథ్యంలో ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమంలో సేకరించిన గణన పత్రాల ఆన్‌లైన్ డిజిటలైజేషన్‌ను ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను అన్నారు.

సమయం ఉంది.. ఆన్‌లైన్ డిజిటలైజేషన్‌లో తప్పులు ఉండరాదు : అదనపు కలెక్టర్ శ్రీను
X

దిశ, మక్తల్ : ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిన నేపథ్యంలో ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమంలో సేకరించిన గణన పత్రాల ఆన్‌లైన్ డిజిటలైజేషన్‌ను ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను అన్నారు. మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను హాజరయ్యారు. 77-మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన కృష్ణ, మాగనూరు, మక్తల్, ఊట్కూర్, నర్వ మండలాల తహసీల్దార్లతో ప్రత్యేక విస్తృత పునర్విచారణ (SIR) కార్యక్రమంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమం కింద సేకరించిన గణన పత్రాల ఆన్‌లైన్ డిజిటలైజేషన్ ప్రస్తుతం పురోగతిలో ఉందని, ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. డిజిటలీకరణ ప్రక్రియను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించడం సంతోషకరమని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొంతవరకు పూర్తయిందని, ఇంకా పెండింగ్‌లో ఉన్న ప్రాంతాల్లో కూడా గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. ఆన్‌లైన్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఎలాంటి తప్పులు లేకుండా, అత్యంత జాగ్రత్తగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను అన్నారు.

Next Story