జ్యూడిషియల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయస్సు పెంపు.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |

జిల్లా న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను కోరింది.

జ్యూడిషియల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయస్సు పెంపు.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని జిల్లా, దిగువ స్థాయి న్యాయస్థానాల (District Judiciary) అధికారుల పదవీ విరమణ వయస్సు పెంపుదలపై భారత సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. జ్యూడిషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, సంబంధిత హైకోర్టులకు అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

ఒకేలా ఉండేందుకు 62 ఏళ్ల ప్రతిపాదన..

అయితే, అన్ని రాష్ట్రాల్లోని జ్యూడిషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సును దేశవ్యాప్తంగా ఏకరూపంగా (Uniform Age) 62 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. న్యాయ వ్యవస్థలో ఉన్న అనుభవజ్ఞులైన అధికారుల సేవలను మరింత కాలం వినియోగించుకోవడం, అలాగే కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ఈ అంశంపై సమీక్ష నిర్వహించింది. న్యాయాధికారుల సర్వీసు నిబంధనలు, పదవీ విరమణ వయోపరిమితిని సవరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల హైకోర్టుల పాత్ర కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా, మొదటి విడతగా పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ధర్మాసనం సూచించింది.

Next Story